క్రీడలు

12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 12 సంవత్సరాల తర్వాత టీమిండియాపై (team india) బాక్సింగ్ డే టెస్ట్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని ఐదో, చివరి టెస్ట్ జనవరి 3, 2025 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు 340 పరుగుల విజయ లక్ష్యం ఉంది. దీంతో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది. భారత 9వ వికెట్‌గా జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. బోలాండ్ అతడిని పెవిలియన్ పంపాడు. సున్నా పరుగులకే బుమ్రా ఔటయ్యాడు. స్మిత్‌ చేతికి చిక్కాడు.

Read Also : పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మాత్రమే అత్యధికంగా 84 పరుగులు చేశాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగుల స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరిగా 208 బంతులు ఆడాడు. అందులో 84 పరుగులు చేశాడు. ఆ క్రమంలో ఆయన ఔట్ కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఒకవైపు స్నికోమీటర్‌లో స్పైక్ కనిపించలేదు. మరోవైపు జైస్వాల్ బ్యాట్, గ్లోవ్ దగ్గర బంతి వెళ్ళినప్పుడు, అది కొద్దిగా దిశను మార్చుకుంది. అయినా కూడా జైస్వాల్‌ను థర్డ్ అంపైర్ అవుట్ చేశాడు.

Also Read : తొలిసారి టైటిల్ గెలిచిన హర్యానా!… ఎట్టకేలకు నెరవేరిన కోచ్ కళ?

జైస్వాల్ ఔటైన 15 పరుగుల సమయంలోనే ఇతర భారత ఆటగాళ్లు కూడా ఔటయ్యారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీ చేశాడు. ఆ క్రమంలో ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడంలో భారత్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌కి వచ్చే సరికి కంగారూ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 155 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
  2. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్
  3. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
  4. ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం! సీపీఐకి ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
  5. హైడ్రా కూల్చివేతలు ఆగవు.. పెద్ద భవనాలనైనా కూల్చేస్తాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button