క్రైమ్

దిల్ షుగ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్.. 12 ఏళ్లుగా ఏం జరిగింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌‌సుఖ్‌ నగర్‌ ‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. 2016 లో నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.

జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్‌‌ రియాజ్‌‌ అలియాస్‌‌ రియాజ్‌‌ భత్కల్‌‌ పరారీలో ఉండగా, మిగిలిన అయిదుగురికి ఎన్‌‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఏప్రిల్ 8న నిందితుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పునిచ్చింది .

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది.


Also Read : కల్తీ మద్యం గుట్టు రట్టు…కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.


దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల దోషులకు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ స్వాగతించారు. హైకోర్టు తీర్పు ఒక చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు కేసులో తీర్పుపై ఎన్‌ఐఏ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈ ఘటనలో అసువులు బాసిన వారంతా నిరు పేదలేనని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఎవరూ మద్దతు ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. దోషులను నడిరోడ్డుపై నిలబెట్టి ఎన్‌కౌంటర్ చేయాని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి .. 

  1. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button