
బోరు బావులు పసివాళ్లకు యమపాశాలుగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒకచోట… బోరుబావిలో చిన్నారి పడిపోయాడన్న వార్తలు తరచూ వింటున్నాం. కొన్ని ఘటనల్లో సహాయక చర్యలు ఫలిస్తే… మరికొన్ని చోట్ల… బోరుబావులు.. ఆ పసిప్రాణాలను బలితీసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో ఇలాంటి విషాద సంఘటన జరిగింది. బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి చనిపోయాడు.
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా పాల్డా గ్రామంలో 32 అడుగుల బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి చనిపోయాడు. 16గంటలపాటు సహాయకచర్యలు చేపట్టిన అధికారులు…. చిన్నారిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే… అప్పటికే చిన్నారి మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
నిన్న(ఆదివారం) మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో… చిన్నారి ప్రహ్లాద్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు పొలం పనుల్లో బిజీగా ఉంటే.. అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ పొలంలో ఒక బోరుబావి ఉంది. దానిపై రాతి పలకపెట్టారు. ఆ రాతిపలకపై చిన్నారి కూర్చున్నాడు. పట్టు తప్పడంతో… జారి బోరుబావిలో పడిపోయాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు పొలానికి అవతలి వైపు పనిచేసుకుంటున్నారు. చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయాన్ని వెంటనే గమనించలేదు. సాయంత్రానికి గుర్తించారు. గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నిచారు. చిన్నారి 32 అడుగుల లోతులో చిక్కుకున్నాడని.. అపస్మారక స్థితిలో ఉన్నాడని గుర్తించారు. బోరుబావిలోకి పైపుల సాయంతో ఆక్సిజన్ కూడా పంపారు. నాలుగు జేసీబీలు తెప్పించి… బోరుబావికి సమాంతరంగా తవ్వారు. దాదాపు 16గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున 3:45 గంటలకు ప్రహ్లాద్‌ను బటయకుతీసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారి చనిపోయినట్టు తెలిపారు.
ఐదేళ్ల చిన్నారి ప్రహ్లాద్ పడిపోయిన బోరుబావిని రెండు క్రితమే తవ్వారు. నీరు పడకపోవడంతో… దాన్ని మూసేయాలని నిర్ణయించినట్టు ప్రహ్లాద్ తండ్రి చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం… ఏ ప్రదేశంలోనైనా బోర్‌వెల్ తవ్వాలంటే అనుమతి తప్పనిసరి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమతి లేకుండా బోర్‌వెల్‌లు తవ్వుతున్నారు. ఆ తర్వాత.. వాటిని పూడ్చటంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వాటి కారణంగా… ముక్కుపచ్చలారని చిన్నారులు… బోరుబావులకు బలవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్