ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాల్టి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది బుకింగ్స్ కూడా చేసుకున్నారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే కచ్చితంగా గ్యాస్ కనెక్షన్ అలాగే రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డుకు E-KYC తప్పనిసరి. లేదంటే గ్యాస్ ఏజెన్సీలు వద్ద లింకు చేసుకోవాలి. ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా కచ్చితంగా లింక్ అయి ఉండాలి. మనం కచ్చితంగా ఇలా చేసుకుంటేనే 48 గంటల్లోగా మన అకౌంట్ లో డబ్బులు అయితే జమవుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీపం పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లను ఇస్తామని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇచ్చిన మాటను ఇవాళ దీపావళి కానుకగా నిలబెట్టుకున్నాడు చంద్రబాబు. కచ్చితంగా మీరు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉచితంగా తీసుకోవాలి. అలా దాదాపు గా 12 నెలలలో అంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తారు.