ఢిల్లీ లోని స్కూళ్లకు వరుసగా ఈమధ్య బాంబు బెదిరింపులు చాలా కామన్ గా మారిపోయాయి. ఇవాళ కూడా వరుసగా రెండో రోజు ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఆర్కే పురం లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఇవాళ ఉదయం 6 గంటలకు 9 నిమిషాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెసేజెస్ వచ్చాయని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
జాతీయ అవార్డు గ్రహీత హీరోను అరెస్ట్ చేయడం తప్పు: కేటీఆర్
ఇక వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు మరియు ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే వారంతా కూడా బాంబు ఎక్కడుంది అని స్కూల్ మొత్తం వెతకగా సెక్యూరిటీ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా 40 స్కూళ్ల వరకు బెదిరింపు కాల్స్ మరియు మెసేజెస్ రావడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.
అల్పపీడనం ఎఫెక్ట్!… ఆంధ్ర, తమిళనాడులో భారీ వర్షాలు?
ఇప్పటికే పోలీసులు అందరు కూడా ఎవరు ఇదంతా చేస్తున్నారు, నేను వెనుక ఎవరూ ఉన్నారనే కోణంలో విచారణలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలోని చాలా స్కూల్లోకి బాంబు బెదిరింపులు రావడంతో ఒకవైపు విద్యార్థులు మరో వైపు తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఢిల్లీ మొత్తం ఈ విషయం పైనే చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే అటువంటి బెదిరింపు కాల్స్ చేసేది ఎవరు అని పోలీసులు గుర్తిస్తామన్నారు.