
క్రైమ్ మిర్రర్, తమిళనాడు :- ఒకేసారి తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే హీరోయిన్ త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం వైరల్ గా మారింది. బాంబు బెదిరింపు కాలు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా పేలుడు పదార్థాలు దొరకపోవడంతో అది ఫేక్ ఫోన్ కాల్ అయ్యుంటుందని నిర్ధారించారు. ఈ బాంబు బెదిరింపులు మన భారతదేశంలో ఎంతో మంది సెలబ్రిటీలకు రావడం ఇది మొదటిసారి ఏం కాదు. ఎన్నోసార్లు చాలామంది సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసే ఉంటాం. నేడు ఒకేసారి ఇద్దరు సెలబ్రిటీలు.. ఒకరు తమిళనాడు సీఎం స్టాలిన్ కాగా మరొకరు సినిమాలలో నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ త్రిష. ఇద్దరికీ ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒకవైపు సీఎం స్టాలిన్ నివాసం వద్ద మరోవైపు త్రిష ఇంటి వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బాంబు బెదిరింపులు వచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా బెదిరింపులు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవడంతో ఆ వ్యక్తి ఎవరో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also : పల్టీలు కొడుతున్న తమిళనాడు రాజకీయాలు.. తాజా సర్వే వైరల్!
Read also : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నిండుగా హుండీ ఆదాయం!