సినిమా

“మహావతార్ నరసింహ” సినిమా ముందు వెనుక పడ్డ బాలీవుడ్ బాడా హీరోల సినిమా వసూళ్లు

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-
యానిమేషన్ మూవీ గా మహవుతార్ నరసింహ దేశవ్యాప్తంగా రికార్డులను కొల్లగొడుతుంది. ఒకవైపు భక్తితోను మరోవైపు యానిమేషన్ పరంగాను ఈ సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను తెరకెక్కించగా ఇప్పటివరకు రికార్డ్ మీద రికార్డులను సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మరియు సల్మాన్ ఖాన్ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో అక్షయ్ కుమార్ సినిమా 113 కోట్లు రాబట్టగా, సల్మాన్ ఖాన్ సినిమా 110 కోట్లు రాబట్టింది. కాగా యానిమేషన్ మూవీ గా రూపొందినటువంటి మహావుతార్ నరసింహ సినిమా కేవలం బాలీవుడ్ లోనే ఏకంగా 126 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 200 కోట్ల గ్రాస్ ను తాకుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

Read also : పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు, నిప్పులు చెరిగిన భారత్

ఎందుకంటే అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా సాధించలేని వసూళ్లను చిన్న సినిమాగా రూపొంది… తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు రాబడుతున్న యానిమేషన్ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా అద్భుతం అని అంటున్నారు. అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల గ్రాస్ ను తాకడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికి కూడా ఈ సినిమాను థియేటర్లలో చాలా భక్తిగా, శ్రద్ధగా వీక్షిస్తున్నారు. చిన్న సినిమా అయినా కథ బాగుంది అంటే… అది ఏ భాష ప్రాంత ప్రజలైన ఆదరిస్తారని అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఇక యానిమేషన్ రూపంలోనూ, అది కూడా నరసింహ అవతారానికి సంబంధించి సినిమా కావడంతో… ప్రేక్షకులు భారీగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ బడా హీరోలను దాటి యానిమేషన్ సినిమా రికార్డు సృష్టించింది అంటే… ఈ సినిమాకి భవిష్యత్తులో అవార్డ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది.

Read also : అందరి చూపు పులివెందుల.. ఎందుకంత టెన్షన్!.. నాయకుల ఆరోపణలు ఇవే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button