బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ తాజాగా కత్తి దాడులతో ఆసుపత్రులు పాలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ను ఆస్పత్రికి తీసుకెళ్లిన డ్రైవర్ భజన్ సింగ్ ను తాజాగా సైఫ్ అలీ ఖాన్ కలిశారు. కలిసిన మరుక్షణమే తనని హగ్ చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో మీరు కనుక లేకపోయి ఉంటే కచ్చితంగా నా ప్రాణానికి ముప్పు ఉండేదని అన్నారు. ఇలానే జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం అందించాలని ఆటో డ్రైవర్ కు సైఫ్ అలీ ఖాన్ సలహారిచ్చారు. మరోసారి తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు డ్రైవర్ భజన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఇదే సమయంలో సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిల ఠాగూర్ కూడా ఉన్నారు. తాజాగా వీటికి సంబంధించిన ఫోటోలనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్లిష్ట సమయంలో ప్రాణాలు కాపాడిన డ్రైవర్ భజన్ సింగ్ కు సైఫ్ అలీ ఖాన్ రివార్డు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మనిషిని గుర్తుంచుకొని మరి గాయాల నుంచి కోలుకొని సహాయం చేసిన మనిషిని కలవడం అనేది చాలా మంచి విషయమనీ సైఫ్ అలీ ఖాన్ ను అందరూ కూడా ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1.200 కోట్ల లెక్క చెప్పు దిల్ రాజు.. ఐటీ సోదాలతో షాక్