
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- బహుజన్ సమాజ్ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ నూతన అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నికయ్యారు. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నరేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్ కాదాసి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం శ్రీనివాస్ హాజరై నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొల్లి నరేష్ మాట్లాడుతూ బీఎస్పీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేరవేస్తానని హామీ ఇచ్చారు. రామకృష్ణాపూర్ పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.సామాజిక న్యాయం ,ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమర్రి మండల అధ్యక్షుడు గాజుల శంకర్, తిరుపతి, గోపి పాల్గొన్నారు.
Read also : పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిళ్ల పంపిణీ
Read also : న్యూ ఇయర్ ఎఫెక్ట్: కిలో మల్లెలు రూ.3,000.. ఎక్కడో తెలుసా?





