Homeతెలంగాణగుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మాదాపూర్,క్రైమ్ మిర్రర్:- మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానమెట్ ఆర్చ్ వద్ద సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు సుమారు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆమె ఆనియన్ రంగు పూల డిజైన్ ఉన్న చీర,మెరూన్ రంగు జాకెట్, గ్రే రంగు హూడీ ధరించి ఉండగా, రెండు చేతులకు బ్యాంగిల్స్ ఉన్నాయి. పరిశీలనలో ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read also : AIతో భయం అక్కర్లేదు.. విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి

Read also : ఇదంతా దేవుడి రాత.. ఎమోషనల్ అయిన సిరాజ్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments