
Turkish Airlines: విమనాయాన చరిత్రలోనే ఓ షాకింగ్ ఘటన జరిగింది. గాల్లో ఉండగా ఓ ప్రయాణీకుడు ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడి మృతదేహం మిస్సైంది. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఏమైందనే విషయం తెలియడం లేదు.
ఇంతకీ అసలు జరిగిందంటే?
జూలై 13న టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం TK79 ఇస్తాంబుల్ నుంచి శాన్ ఫ్రాన్సికోకు బయల్దేరింది. కొంతదూరం వెళ్లాక, ఓ ప్రయాణీకుడు ఆస్వస్థతకు గురై చనిపోయాడు. వెంటనే విమానాన్ని ఐస్లాండ్ లోని కెఫ్లావిక్ విమానాశ్రయానికి మళ్లించాలి అనుకున్నారు. కానీ, అక్కడి ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో షికాగో ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సదరు ప్రయాణీకుడి డెడ్ బాడీని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ లో అప్పగించారు. మిగిలిన ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
తమకు మృతదేహం అందించలేదన్న అధికారులు
ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం అందలేదని ఎగ్జామినర్ ఆఫీస్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విమానం ల్యాండింగ్ తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సరదు మృతి చెందిన ప్రయాణికుడికి సంబంధించిన వివరాలను విమానయాన సంస్థ వెల్లడించలేదు. త్వరలోనే అసలు విషయాలు బయటకు రానున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
Read Also: థాయ్ లాండ్, కంబోడియా పరస్పర ఘర్షణలు, 12 మంది మృతి!