
-చాపల వేటకు వెళ్లి యువకుడు బలి
-నేరేడుచర్ల చిల్లేపల్లి గ్రామంలో మృతదేహం లభ్యం
క్రైమ్ మిర్రర్, వేములపల్లి:- చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువకుడు గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమైనట్లు మండల ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన మద్దెబోయిన రామకృష్ణ తండ్రి వెంకన్న అనే యువకుడు గ్రామంలోని తన స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం గ్రామం శివారులో ఉన్న మూసి వాగులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గ్రామ శివారులోని మూసి ఏరులో గల్లంతైన విషయం తెలిసింది. అతని ఆచూకీ కోసం రెండు రోజులుగా గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆదివారం సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం, చిల్లేపల్లి గ్రామం శివాలలోని మూసి ఏరులో ఓ యువకుని మృతదేహం గుర్తించినట్లు నేరేడుచర్ల మండలం ఎస్ఐ సమాచారం ఇచ్చినట్లు వేములపల్లి మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమాచారాన్ని మృతుని బంధువులకు తెలియజేసినట్లు తెలిపారు.. ఈ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also : ఖమ్మంలో దొంగల హల్‌చల్ – సీసీ కెమెరాల్లో రికార్డ్
Read also : కమలం గూటిలో చేరిన గువ్వల