Wednesday, March 4, 2026
Homeతెలంగాణపాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల యువకుడి మృతదేహం లభ్యం

పాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల యువకుడి మృతదేహం లభ్యం

కోదాడ, క్రైమ్ మిర్రర్:- సూర్యాపేట జిల్లా,కోదాడ నియోజకవర్గం,అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ (35) సంవత్సరాల యువకుడు గురువారం పాలేరు వాగులో ముగ్గురు వ్యక్తులు పందెం కాసుకొని ఇద్దరు వ్యక్తులు బ్రిడ్జి పైనుండి వాగులోకి దూకగా ఒక వ్యక్తి బ్రిడ్జిపైనే ఉన్నాడు. దూకిన ఇద్దరి వ్యక్తులలో ఒక వ్యక్తి పైకి రాగలిగాడు… కానీ కిన్నెర ఉపేందర్ అనే వ్యక్తి దూకిన మరుక్షణమే కనిపించకుండా వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినారు. అయినా సరే ఆచూకీ లభ్యం కాలేదు ఈరోజు అనగా శనివారం ఉదయం రైతులు పోలాలకు వెళుతుండగా గొండ్రియల బ్రిడ్జికి కూత వేటు దూరంలో శవం తేలడం గమనించి గ్రామ ప్రజలకు తెలపగా వారు పోలీసు వారికి సమాచారం అందించి బాడీని వాగులో నుండి బయటకు తీశారు.

Read also : వ్యక్తిగత కోపం భారత్‌ పై ట్రంప్ టారిఫ్ లు, తేల్చిన జెఫెరీస్‌ నివేదిక!

Read also : ప్రపంచం ఆశలు భారత్ మీదే.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments