జాతీయం

బోటు బోల్తా… సముద్రంలో పడిన గంగూలీ ఫ్యామిలీ!

ఓడ ప్రమాదంలో తృటిలో తప్పిన విషాదం – సమయస్ఫూర్తితో రక్షణ

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ వెబ్ డెస్క్ : మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కుటుంబం భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. పర్యటనలో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి సముద్ర సఫారీకి బయలుదేరిన గంగూలీ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా అన్‌బ్యాలెన్స్ అయి బోల్తా పడింది.

ఈ ఘటనలో బోటులో ఉన్న వారు అందరూ సముద్రంలో పడిపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది.

ప్రస్తుతం గంగూలీ కుటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో సేఫ్టీ ప్రోటోకాల్ లపై మరోసారి ప్రశ్నలు రేగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button