మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- కెవిఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో సోమవారం, రాజపేటతండా గ్రామపంచాయతీ నందు, ఫౌండేషన్ చైర్మన్, సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి, ఆయన తమ్ముడు అల్వాల్ రెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం, రక్తధాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా కొడాల బ్రదర్స్ మాట్లాడుతూ…. రక్తం దొరకక ఏ ఒక్కరూ కూడా మరణించకూడదని, అత్యవసర సమయంలో రక్తం దొరకక చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రక్తధానం చేసిన వారికి అయిదు లక్షల, ప్రమాద భీమాను అందిస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు.
రక్తధానంపై ప్రజలు అపోహలు వీడాలని, ఆరోగ్యవంతులైన వారు రక్తధానం చెయ్యడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మనకు తెలిసిన వారు ఎంతో మంది, రక్తం దొరకక మృత్యువాత పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, యువత తరచూ రక్తధానం చెయ్యాలని వారు సూచించారు.
మన రక్తంతో మరో వ్యక్తి బ్రతుకుతున్నారంటే, ఎంతో పుణ్యం చేసినట్లేనని అన్నారు. కొడాల బ్రదర్స్ ఇప్పటికే ఇలాంటి ప్రజా సేవలు ఎన్నో చేసి ఉన్నారు. ఈ రక్తధానంతో వారిని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు..





