- రాజ్యాంగ విలువలు పాటించని మంత్రి వివేక్
- దాడులు చేయడం సరైంది కాదు
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: రాష్ర్ట కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి చైర్మన్, వైస్ చైర్మన్‌ల ప్రమీణ స్వీకారొత్సవాన్ని అడ్డుకొని ఘర్షణకు దిగడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో ప్రజల తీర్పును గౌరవించకుండా రాష్ర్ట మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ప్రవర్తించడం సిగ్గుచేట న్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటితో బీఆర్ ఎస్ 10, సీపీఐ 4 గెలుచుకొని ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులతో కలిసి బీఆర్ ఎస్ , సీపీఐ నాయకులపై దాడులకు పాల్పడడం రాజ్యాంగ విరుద్దం కాదా అని ప్రశ్నించారు. రాష్ర్టంలో ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ ఎస్ పార్టీ గౌరవించిందని తెలిపారు. ఓడిపోయామనే అక్కసు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. గెలిచిన అభ్యర్థులతో భద్రాచలంలోని రాముడికి దర్శనానికి వెళ్తున్న క్రమంలో వాహనాలతో వెంబడించి దాడులు చేయడం సరికాదన్నారు. ఏదేమైన క్యాతన్‌పల్లి మున్సపాలిటిలో బీఆర్ ఎస్ చైర్మన్, సీపీఐ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట కార్యవర్గ సభ్యులు కలవేణ శంకర్ మాట్లాడుతూ బీఆర్ ఎస్, సీపీఐ పొత్తులో మొదటి నుంచి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. ఏఐటీయుసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నాయకులంతా గౌరవించాలన్నారు. సైట్ విజిట్‌లో భాగంగా అదికార పార్టీకి టెండర్లు కట్టబెట్టి సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. సింగరేణి ప్రాంతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్మికులు కాంగ్రెస్‌కు గట్టిబుద్ది చెప్పారన్నారు. చైర్మన్ , వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సజావుగా జరిగేలా మంత్రి వివేక్ వెంకటస్వామి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ ఎస్ ఇంచార్జీ డాక్టర్ రాజా రమేశ్, సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్, సీపీఐ నాయకులు శ్రీనివాస్, బీఆర్ ఎస్ పట్టణ అద్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
