హైదరాబాదు, నాంపల్లి లో ఉన్నటువంటి బిజెపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు మరియు రాళ్లతో దాడి చేయడం జరిగింది. దీంతో బీజేపీ మరియు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పాటు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇక వెంటనే పోలీసులు కలుగ చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బిజెపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Read More : కేటీఆర్ పిటిషన్ డిస్మిస్.. ఎల్లుండి అరెస్ట్!
కాగా తాజాగా ఢిల్లీలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల నున్నగా మారుస్తామని బిజెపి నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే నాంపల్లి లో ఉన్నటువంటి బిజెపి ఆఫీస్ పై కోడిగుడ్లు మరియు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో బీజేపీ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ చివరికి కర్రలతో దాడులు చేసుకున్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఘర్షణలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
Read More : భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ
ఈ ఘర్షణలో ఇప్పటికే పలువురికి గాయాలు కాగా, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారం ఉందని పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు మా ఆఫీస్ పై దాడులు చేశారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే కావాలనే బిజెపి వాళ్లు మాపై దాడులకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానపరిచిన బిజెపి నేత రమేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More : భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం