అల్లు అర్జున్ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి చర్చలపై తాజాగా తెలంగాణ బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా బోనులో పెట్టే ఆలోచనలో ఉన్నారని ఈటల మండిపడ్డారు. ఎక్కడైనా సరే సినిమా స్టార్స్ , క్రికెట్ ప్లేయర్స్ అలాగే రాజకీయ నేతలకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యలలో భాగంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి పదే పదే అదే అల్లు అర్జున్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని తెలియజేశారు.
ఈ ఏడాది మరణించిన మహానుభావులు వీరే!
మరోవైపు ఒకరి నిర్లక్ష్యం వల్ల ఒక ఆడ మహిళ నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక గుణపాఠం లా భావించాలని చెప్పుకొచ్చారు. ఇకనైనా సరే సెలబ్రిటీలు అందరూ కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా ప్రీమియర్స్ షో సందర్భంగా తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం అలాగే తన కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతుండడంతో ఈ విషయం గురించే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి!సీసీ కెమెగా ఫుటేజీలో సంచలన నిజాలు
ఇక ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కూడా అరెస్టు అవడం మల్లి తిరిగి వెంటనే బెయిల్ మీద బయటకు రావడం అన్ని కూడా వెంటనే జరిగిపోయాయి. అయితే తరువాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలు మద్దతుగా నిలిచాయి. చనిపోయిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మరియు అల్లు అర్జున్ అలాగే పుష్ప సినిమా యూనిట్ అందరూ కూడా సహాయం కింద కోటి రూపాయలు వరకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.