తెలంగాణ

ప్రభుత్వం విఫలమై… అల్లు అర్జున్ ను హైలెట్ చేస్తున్నారు?

అల్లు అర్జున్ కేసు గురించి తాజాగా బిజెపి ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం భద్రత విషయంలో వైఫల్యం అవ్వడమే కాకుండా ఈ విషయాన్ని పక్కన పెట్టి మరి హీరోని మాత్రమే ప్రభుత్వం తప్పు అనడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కూడా కచ్చితంగా ఉందని కేవలం అల్లు అర్జున్ ది మాత్రమే తప్పు కాదని అన్నారు.

విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ… 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు

ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలోనే ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందని ఆరోపించారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు CP వీడియోలు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై మాత్రమే కాకుండా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మొత్తం పై కక్ష కట్టినట్లుగా ప్రవర్తించడం అసలు మంచిది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు బిజెపి ఎంపీ రఘునందన్ రావు.

కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ

కాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట లో చనిపోయిన రేవతి కేసులో భాగంగా అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగానే ఇలా హైలెట్ చేస్తున్నారని చాలామంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. మరోవైపు బిజెపి మరియు బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలిచాయి. ఏది ఏమైనా సరే ఒకవైపు పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో దూసుకుపోతుంటే ఇటువైపు మాత్రం అల్లు అర్జున్ కి బాధ కలిగించేటువంటి విషయం.

అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్.. తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button