తెలంగాణ
Trending

మోడీ గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి నీకు లేదు!… ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పు: బిజెపి ఎంపీ

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ‘ప్రధాని నరేంద్ర మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా మండిపడుతూ కౌంటర్ ఇచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో రేవంత్ నువ్వు చెప్పు అంటూ డిమాండ్ చేశారు. మోది కులం ఓసి నుంచి బీసీకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయంపై బిజెపి ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అసలు ప్రధానమంత్రి మోడీ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది రేవంత్ రెడ్డి అని బిజెపి ఎంపీ అన్నారు. నరేంద్ర మోడీ క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి నువ్వు వీటి గురించి మాట్లాడుతున్నావా అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాగా నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 2002 వరకు మోదీ ఉన్నత కులాల్లో ఉండేవారని అన్నారు. ఇక గుజరాత్ సీఎం ఎప్పుడైతే అయ్యారో ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపేసారని ఆరోపించారు. నేనేమీ అబద్ధం చెప్పట్లేదని, ప్రతి ఒక్కటి తెలుసుకొని మోదీ కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బిజెపి కార్యకర్తలు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రతీకారం కోసం డబ్బును వృధా చేయకూడదు!… ప్రధాన దేశాలన్నీ కూడా కలిసి పని చేయాలి?

అప్పుడు రేట్లు పెంచితే రాద్ధాంతం!… మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటి: మాజీమంత్రి

కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button