
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. మరి కొద్ది రోజుల్లో రాబోయే హోలీ రోజు ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరగవద్దు అని హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. హిందువుల పండుగలు అంటేనే మీకు ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. హిందువులు పండుగలు ఎలా జరుపుకోవాలో పోలీసులు.. 9వ నిజాం రేవంత్ చెప్తారా?.. మీకు ఆ అర్హత లేదు అంటూ చెప్పుకొచ్చారు.
హోలీ రోజు బయటకు వెళ్ళవద్దని ముస్లింలకు చెప్పాల్సింది. రంజాన్ నెలలో అయితే మాత్రం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగే న్యూసెన్సు మీకు కనపడట్లేదా?.. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ అధికారులను ప్రశ్నించారు. మా పండగలు ఎలా జరుపుకోవాలి మా హిందువులకు బాగా తెలుసు…. మీలాంటివారు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి ఒకటో తారీకు నుంచి డిసెంబర్ 31 వరకు హిందువులకు సంబంధించి ఎన్ని పండుగలు ఉన్నా కూడా వాటన్నిటికీ ఆంక్షలు విధించడం చాలా తప్పు అంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. హిందువులు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశం లో మీలాంటోళ్లు ఉండడం మా దురదృష్టం అంటూ చెప్పకు వచ్చారు. ఇక ఇతర ఏ మత పండుగలకు ఇలాంటి ఆంక్షలు విధించడం లేదే?.. మరి మా హిందువుల పండుగలకు మాత్రమే ఎందుకు ఈ ఆంక్షలు విధిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
మాట వినలేదు కాబట్టే రాజీనామా చేశా!…మళ్లీ వైసీపీ పార్టీలో చేరే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి