
కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య రౌండ్ రౌండ్ కు ఆధిక్యతలు తగ్గుతున్నాయి. తొలి ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో మొదటి స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు సాగుతోంది.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. చివరి 11 వ రౌండ్ లో బీజేపీకి 399 ఓట్ల లీడ్ వచ్చింది.
11 వ రౌండ్ అనంతరం అభ్యర్థుల మొత్తం ఓట్లు
బీజేపీ అంజిరెడ్డి. 74,548
కాంగ్రెస్ నరేందర్ 69,581
బీఎస్పీ ప్రసన్న 59,751
బీజేపీ లీడ్ 4,977