
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పంచాయతీ ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీని హవా కొనసాగించింది అని కొన్ని వాక్యాలు చేయగా.. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రెండేళ్లకే ప్రజలు పూర్తిగా విసిగిపోయారు అని… మళ్లీ కెసిఆర్ తిరిగి అధికారంలోకి రావాలన్న భావనలు ప్రజల్లో కలుగుతున్నాయి అని అన్నారు. ఒక వైపేమో సీఎం రేవంత్ రెడ్డి మా పార్టీ అభ్యర్థులు ఈ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ విజయాలను సాధించారు అని చెబుతుండగా.. మరోవైపు కేటీఆర్ మాత్రం అవన్నీ ఒకటి నుంచి పది ఓట్లు తేడాతో మాత్రమే గెలిచారు అని కౌంటర్లు వేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలలో చాలాచోట్ల పోటా పోటీగా స్థానాలు దక్కించుకున్నట్లుగా కేటీఆర్ వెల్లడించారు. ఒక ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్ గా గెలవడం కష్టం అనేది నిజమని తాజాగా భువనగిరి పర్యటనలో భాగంగా కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారు అని సీఎం రేవంత్ పై అలాగే స్పీకర్ ను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
Read also : రోడ్డు ప్రమాదాలు జరిగితే సాయం చేయండి.. ₹25000 బహుమతి పొందండి : కేంద్రమంత్రి
Read also : హీరోయిన్ ను అసభ్యకరంగా తాకిన ఘటన.. పలువురుపై కేసులు నమోదు!





