-
గులాబి పార్టీతో కమలం
-
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్
-
భారతీయ జనతా పార్టీ హైకమాండ్ గరం గరం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే గతం మాదిరిగా దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఎంపీలను పిలిచి క్లాస్ పీకినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినా సరే బిజెపి నేతల వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. గతం మాదిరిగా దూకుడు ప్రదర్శించడం లేదు. పైగా లేనిపోని వ్యాఖ్యలు చేసి పార్టీని అడ్డంగా బుక్ చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బిజెపిపై ఒక విమర్శ తరచూ చేస్తోంది. గులాబీ పార్టీతో బిజెపిది ఫెవికాల్ బంధం అంటూ ఆరోపిస్తోంది. అది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి ఎమ్మెల్యే పైడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బిజెపికి భారీగా డామేజ్ చేస్తున్నాయి.
-
సార్వత్రిక ఎన్నికల తర్వాత..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రకరకాల విమర్శలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారం పై మమకారం పెంచుకుంది. కానీ గులాబీ పార్టీతో బిజెపితో పొత్తు ఊహాగానాలు కాషాయ పార్టీని దెబ్బతీసాయి. అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. అప్పటినుంచి మరింత కొత్త చర్చ మొదలయ్యింది. గులాబీ పార్టీ కచ్చితంగా బిజెపితో పొత్తు పెట్టుకున్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో పతాక స్థాయికి చేరింది. అయితే పొత్తుతో క్షేత్రస్థాయిలో బలపడవచ్చు అన్నది బిజెపిలో కొందరి అభిప్రాయం. కానీ కెసిఆర్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత బిజెపి పై ప్రతాపం చూపి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చుతుందనేది మరో అంచనా.
-
పొలిటికల్ గా డ్యామేజ్..
గత కొంతకాలంగా తెలంగాణ బిజెపి నేతలు చాలా జాగ్రత్త పడ్డారు. తమ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు అని తేల్చి చెప్పారు. పొలిటికల్ డామేజ్ కంట్రోల్ లో భాగంగా ఆ పార్టీ నేతలు అలా ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ బిజెపిలో ఉండి గులాబీ పార్టీపై అభిమానంతో ఉండే నేతలు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే బిజెపికి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంటే తప్పు ఏంటని ప్రశ్నించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్పులేదు.. ఇక్కడ పెట్టుకుంటే తప్ప అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే గులాబీ పార్టీతో తమ పార్టీకి పొత్తు లేదు అని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. అటువంటప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలా ప్రకటిస్తారు అనేది ఇప్పుడు కొత్త వాదన. బిజెపి హై కమాండ్ కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జిల్లా పరిషత్,మండల పరిషత్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా ఇబ్బంది పెడతాయని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ కూడా దీనిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. బిఆర్ఎస్ తో తమ పార్టీ పొత్తు పెట్టుకోదు అని బిజెపి హై కమాండ్ ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
