క్రైమ్ మిర్రర్,హైదరాబాద్ : సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటన భాగంగా అల్లు అర్జున్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో భాగంగానే అల్లు అర్జున్ కు బిజెపి మరియు బిఆర్ఎస్ పార్టీలు అండగా నిలిచాయి. రేవతి చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ అల్లు అర్జున్ కి మద్దతు ప్రకటించారు.
నా భార్య భూమా మౌనికను చంపాలని ప్లాన్! అన్నపై మంచు మనోజ్ కంప్లైంట్
ఇక తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం పేరు మర్చిపోతేనే నేషనల్ అవార్డు పొందిన హీరోని అరెస్టు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. వీరు మాత్రమే కాకుండా బిజెపి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బిజెపి ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనోత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ట్వీట్స్ చేశారు.
అల్లు అర్జున్ కు షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. అరెస్ట్ ఖాయమా?
గతంలో చాలామంది హీరోలు అలాగే రాజకీయ నాయకుల ఫంక్షన్స్ జరిగేటప్పుడు తొక్కిసలాటలో చాలామంది మరణించారు. అప్పుడు ఇలానే రాజకీయ నాయకులందరినీ అలాగే సినిమా హీరోలందరినీ కూడా అరెస్టు చేశారా అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏ మాత్రం ఎవరిది కూడా తప్పులేదు అని అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ పై కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు అంటూ మరోవైపు చాలా మంది చిల్లర పాలిటిక్స్ చేస్తున్నారంటు మండిపడుతున్నారు.
అల్లు అర్జున్ కు షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. అరెస్ట్ ఖాయమా?