Tuesday, February 17, 2026
Homeతెలంగాణజాతిపిదాత జన్మదిన వేడుకలు..

జాతిపిదాత జన్మదిన వేడుకలు..

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల శివ అన్నారు. జన్మదిన పురస్కారంలో భాగంగా కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆకుల శివ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరస్థాయిగా ఉంటాడని.. గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సాధించిన కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కేశవ్, సలహాదారులు బందేల వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రత్న రాజిరెడ్డి, నాగుల తిరుపతి, బస్వ సతీష్, రత్న సాంబం, కుంభం రమేష్, భూపెళ్లి రవితేజ, మందుట నరేష్, ప్రశాంత్, సాయి, విష్ణు, కొయ్యల రాజబాబు, అంజి, సత్యం మరియూ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

లక్కీ డ్రా… చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు

క్యాతనపల్లిలో 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు.. రెండు రోజులపాటు గుంపుల నిషేధం,ర్యాలీలకు బ్రేక్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments