క్రైమ్ మిర్రర్ తెలంగాణ : హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద ఆదివారం సాయంత్రం (జనవరి 18, 2026) శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అభిజిత్ దాస్ (25), సుజీత్ కుమార్ ముఖ్యా (20)గా గుర్తించారు. వీరు బీహార్‌కు చెందిన వారని, శంషాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని సమాచారం. వీరు గొల్లపల్లి గ్రామం నుండి బహదూర్‌గూడ వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శంషాబాద్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు మరియు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





