
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఘనంగా సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులు కూడా ప్రవేశించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం చాలామందికి కళగా ఉంటుంది. సెలబ్రిటీలు అయితే అవకాశం చాలా తొందరగా వస్తుంది. ఇక సామాన్యులకైతే అవకాశం రావాలంటే వారు పక్కాగా నక్క తోక తొక్కి ఉండాల్సిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 9. ఈ బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లడానికి చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన వారు కూడా ఉన్నారు. ఎంతో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న వారు బిగ్బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళ ఫేమ్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారికి కాసుల వర్షం పండుగ అనే చెప్పాలి. ఈ డబ్బుల కోసం చాలామంది బిగ్ బాస్ కి వెళ్లిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
Read also : రెండు అల్పపీడనాలు, మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం ఖాయం?
సహజంగా బయట ఏదైనా పనిచేసిన, ఏదైనా సినిమాలో నటించిన నెల మొత్తం కూడా పనిచేస్తేనే శాలరీ రూపంలో డబ్బులు వస్తాయి. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకుంటూ, ఆటలాడుకుంటూ, పోట్లాడుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తేనే లక్షలలో డబ్బులు ఇస్తున్నారు. ఈ సీజన్లో ఒకరు సెలబ్రిటీ శ్రేష్ఠి వర్మ, మరొకరు కామనర్స్ నుంచి వచ్చిన మర్యాద మనిశ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ సీజన్ 9 బిగ్బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బిగ్బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ 1 వీక్ రెమ్యూనరేషన్
1. రీతు చౌదరి – మూడు లక్షలు
2. భరణి – 2,25,000
3. సంజన – 2,25,000
4. ఇమ్మానుయేల్ – రెండు లక్షలు
5. సుమన్ శెట్టి – రెండు లక్షలు
6. తనుజ – రెండు లక్షలు
7. రాము రాథోడ్ – రెండు లక్షలు
8. హరీష్ – మూడు లక్షలు
9. దమ్ము శ్రీజ – మూడు లక్షలు
10. మర్యాద మనీష్ – మూడు లక్షలు
11. డిమాన్ పవన్ – మూడు లక్షలు
12. ప్రియా శెట్టి – మూడు లక్షలు
13. శ్రేష్టి వర్మ – మూడు లక్షలు
14. పవన్ కళ్యాణ్ – మూడు లక్షలు
15. ఆశాశైని – 2,25,000
Read also : ఖాళీగా తిరుమల కొండ… కీలక వ్యాఖ్యలు చేసిన అధికారులు!