
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బుల్లితెర షోలలో తనదైన పర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించేటువంటి యాంకర్ లోబోకు సంవత్సరం పాటు జనగామ కోర్ట్ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా మరో 12,500 రూపాయలను జరిమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష ఎందుకు పడిందంటే.. గతంలో అనగా.. 2018 వ సంవత్సరంలో లోబో ఒక కారును నడుపుతూ జనగామ జిల్లా, నిడిగొండ వద్ద అదుపుతప్పి ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్నటువంటి ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మేడే కుమార్, పెంబర్తి మన్నెమ్మ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలోనే ఒకవైపు ఇద్దరు మరణించగా మరో వైపు లోబో కారు కూడా బోల్తాపడడం జరిగింది. దీంతో లోబోతో పాటుగా కారులో ఉన్న వ్యక్తులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా జనగామ కోర్టు తీర్పును వెల్లడించడం జరిగింది. దీంతో లోబో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకుకు గురవుతున్నారు. మరి దీనిపై కొంతమంది ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే. లోబో బిగ్ బాస్ షో తో చాలామందికి పరిచయమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ షో లోనే లోబో ను పరిచయం చేసుకున్నారు.
Read also : మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాకు అలర్ట్!
Read also : ఎడతెరిపిలేని కుండపోత.. ఉత్తర తెలంగాణ కకావికలం!