ఆంధ్ర ప్రదేశ్

గేమ్ చేంజెర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!… ట్రైలర్ ఎప్పుడంటే?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమా ట్రైలర్ కు సంబంధించి చిత్ర యూనిట్ తేదీని ప్రకటించారు. జనవరి 2వ తారీఖున సాయంత్రం 5.04 గంటలకు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆట మొదలైంది అంటూ రామ్ చరణ్ పంచ కట్టు ఫోటో ను విడుదల చేశారు.

భారతదేశ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన మోడీ..!

ఇక ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీగా అడ్వర్టైజ్మెంట్ లు చేస్తున్నారు. సినిమాపై భారీ హోప్స్ పెంచుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నా ఈ సినిమాకి పోటీగా బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మరియు వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీ పడనున్నాయి.

రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైరికల్ కామెంట్స్

కాగా భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజెర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button