
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 లీగ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ప్లేయర్స్ ఆటను చూసి మురిసిపోవడానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని ఆలోచిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి ఏడాదిలాగే ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చి చివరిలో జరుగుతుంది అని సమాచారం. అయితే తాజాగా ఐపీఎల్ మినీ వేలం గురించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం డిసెంబర్ 15వ తేదీ న నిర్వహించే అవకాశం ఉంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే గతంలో రెండుసార్లు వేలంపాటలను సౌదీ అరేబియా మరియు దుబాయ్ లలో జరపగా ఈసారి మాత్రం మన దేశంలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. అయితే ఈ నెల 15వ తారీకున రిటెన్షన్ డెడ్లైన్ ముగుస్తుంది అని ప్రకటించారు. కాబట్టి ఈ లోపు ఆయా జట్ల ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకున్నటువంటి ప్లేయర్లను ప్రకటించాలి. ఇక వారు వదిలేసిన ఆటగాళ్లు ఈ మినీ వేలంలో ఇతర జట్లు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్లు జడేజా, సాంసంగ్ ను ట్రేడ్ చేసుకోవచ్చు అని విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా 18 ఏళ్ల నిరీక్షణకు గత సంవత్సరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మరి ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ ని ఎవరు ముద్దాడుతారు అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : శ్రీ చరణి మంచి మనసు.. కడప క్రికెట్ అకాడమీ ప్రశంసలు!
Read also : చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవి.. ఎందుకంటే?





