
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పాలసీలను వ్యతిరేకిస్తూ తాజాగా లక్షల్లో జనం రోడ్లు ఎక్కారు. లక్షలాదిమంది ప్రజలు ఒక చోటే చేరి భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఎడ్యుకేషన్, ఇమిగ్రేషన్, సెక్యూరిటీ పాలసీలపై ” NO KINGS ” పేరిట ప్లకార్డులు పట్టుకుని గ్లోబల్ ప్రొటెస్టు చేపట్టారు. అమెరికాలో ప్రధాన నగరాలు అయినటువంటి చికాగొ, వాషింగ్టన్, న్యూయార్కు వంటి నగరాలతో పాటుగా ఇతర దేశాల్లోని ఎంబసీల వద్ద కూడా భారీ ఎత్తున నిరసనలు చేపట్టడంతో మొత్తం దేశవ్యాప్తంగా ఈ నిరసన లు హైలెట్ గా నిలుస్తున్నాయి. వేరే దేశాల యుద్ధాలు ఆపుతున్నానని, శాంతిభద్రతలను కాపాడుతున్నానని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర దేశాల్లో ఉన్న సమస్యల కంటే ముందు మన స్వదేశంలో ఉన్నటువంటి సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ట్రంప్ కు సూచిస్తున్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా నేడు ఈ నిరసనలు చూస్తుంటే ట్రంప్ కూడా షాక్ లో ఉన్నారని తెలుస్తుంది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద నిరసనలు ఎప్పుడు చూడలేదంటూ కొంతమంది నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ముందు స్వదేశంలో సమస్యలు తీర్చుకో అని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలామంది ట్రంప్ ను ఎద్దేవా చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఎన్నో యుద్ధాలు ఆపాను అంటూ చెప్పుకొచ్చిన డోనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో నిరాశలో ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు రావడంతో ఈ విషయం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారిపోయింది.
Read also : కోహ్లీ డక్ ఔట్… పీకల్లోతు కష్టాల్లో టీమిండియా!
Read also : వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు