Uncategorizedక్రైమ్

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి బిగ్‌షాక్‌… హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అరెస్ట్

  • హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు అరెస్ట్‌

  • సన్‌రైజర్స్‌తో టికెట్ల వివాదంలో బిగ్‌ ట్విస్ట్‌

  • హెచ్‌సీఏ పాలకవర్గాన్ని అదుపులోకి తీసుకున్న సీఐడీ

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌కి బిగ్‌షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ టీమ్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో టికెట్ల వ్యవహారంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌రావుతో పాటు పాలకవర్గాన్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ టికెట్ల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ మధ్య వివాదం నెలకొంది. మ్యాచ్‌ సందర్భంగా తమకు అనుకున్న టికెట్ల కేటాయించలేదని ఆరోపిస్తూ… కార్పొరేట్‌ బాక్స్‌కు హెచ్‌సీఏ పాలకవర్గ సభ్యులు తాళం వేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏతో తెగదెంపులు చేసుకుంటామని అప్పట్లో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం బహిరంగంగానే వెల్లడించింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం… ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ సీజ్‌

ఎస్‌ఆర్‌హెచ్‌-హెచ్‌సీఏ మధ్య వివాదాన్ని తెలంగాణ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఐపీఎల్‌ ప్రాంచైజీ వెళ్లిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించింది. దీంతో ఈ వివాదంపై విజిలెన్స్‌ విచారణకు రేవంత్‌ సర్కార్‌ ఆదేశించింది. దీనిపై సుదీర్ఘంగా విచారించిన విజిలెన్స్‌ సన్‌రైజర్స్‌ ప్రాంచైజీపై హెచ్‌సీఏ అధ్యక్షుడు ఒత్తిడి తీసుకొచ్చారని నిర్థారించారు. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ను ఇబ్బంది పెట్టింది వాస్తవమేనని తేల్చింది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇస్తున్న 10శాతం టికెట్లకు అదనంగా మరో 10శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు విజిలెన్స్‌ నివేదికలో బట్టబయలు చేసింది. దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌తో సహా ఫుల్‌ బాడీని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button