Tuesday, March 17, 2026
Homeక్రైమ్బిగ్ బ్రేకింగ్: కళ్లలో కారం చల్లి.. రూ. 1 కోటి నగదు అపహరణ..!

బిగ్ బ్రేకింగ్: కళ్లలో కారం చల్లి.. రూ. 1 కోటి నగదు అపహరణ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సోమవారం రాత్రి (మార్చి 16, 2026) ఈ భారీ దోపిడీ జరిగింది. బైక్‌ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో దుండగులు కారం చల్లి, రూ. 1 కోటి నగదు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారు. బహదూర్‌పూరకు చెందిన ఏసీ మెకానిక్స్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఖుస్రూ (42) మరియు మహమ్మద్ అజీముద్దీన్ (38).

వీరు బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 837 సమీపంలో రాత్రి 9:40 గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన సుమారు నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బాధితుల కళ్లలో కారం కొట్టి, వారిని కిందపడేలా చేశారు.

అనంతరం ఒక కార్టన్ బాక్స్‌లో ఉన్న నగదును తీసుకుని మెరుపు వేగంతో పారిపోయారు. కూకట్‌పల్లి పోలీసులు నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం వద్ద ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇంత పెద్ద మొత్తంలో నగదును సాధారణ కార్టన్ బాక్స్‌లో తరలిస్తుండటంతో, పోలీసులు ఇది హవాలా సొమ్ము అయి ఉండవచ్చని బలంగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments