అంతర్జాతీయం

టర్కీలో భారీ అగ్ని ప్రమాదం!.. 66 కు చేరిన మృతుల సంఖ్య?

టర్కీలో తాజాగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఏకంగా 66 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

అలా చేయకపోతే నన్ను గన్నుతో కాల్చండి : ఆర్జీవి

12 అంతస్తుల హోటల్ భవనంలో తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది గెస్ట్‌లు ఉన్నట్టుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.12 అంతస్తుల హోటల్‌లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button