
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- మన దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో ఇవాళ ఉదయం ఢిల్లీలోని పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలందరూ తీవ్రమైన భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనల ద్వారా ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కి బర్త్డే విషెస్ తెలిపిన ముఖ్యమంత్రి!..తెలంగాణ లో తగ్గిన రాజకీయ వేడి?
తాజాగా ఈ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మరోసారి ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం గా ఉండాలని X వేదికగా తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.