ఈమధ్య ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ ఉదయం నేపాల్ మరియు టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించడం జరిగింది. ఈ భూకంపం వల్ల భారీగా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరిగింది. పలుచోట్ల చాలా భవనాలు కూలిపోగా అందులో చాలామంది ప్రజలు ఇరుక్కుపోయారు. కాగా ఇప్పటికీ ఆ భవనాల మధ్య ఇరుక్కుపోయి దాదాపుగా 37 మంది మరణించడం జరిగింది.
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
ప్రస్తుతం కేవలం 32 మంది మృతదేహాలను మాత్రమే బయటకు తీశారు. ఈ భూకంపం దాటికి కూలిపోయిన భవనాల మధ్య ఇరుక్కుపోయిన వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. కాగా అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కథనాలు అన్నీ కూడా భారీగా ప్రాణనష్టం జరిగిందని చెప్పుకొస్తున్నాయి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మరణాల సంఖ్య అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ భూకంపం అనేది భారీ ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టం ను కూడా మిగిల్చింది. దీంతో చాలామంది మృతదేహాలను వెలుకి తీసే పనులో నిమగ్నమై ఉన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ భూకంపాలు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందే. విచిత్రంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేరోజు రెండు మూడు సార్లు కూడా భూకంప ప్రకంపనలనేవి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. ఏది ఏమైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య చాలా ప్రాంతాల్లో భూకంపాలనేవి కామన్ గా మారిపోయాయి. అయితే ఎక్కడ కూడా పెద్దగా ప్రభావితం చూపని భూకంపం అనేది ఇవాళ నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల్లో భూకంపం చాలా తీవ్రమైన ప్రభావితం చూపిందని చెప్పాలి.
రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోస్టర్లు