తెలంగాణ
Trending

బిగ్ బ్రేకింగ్… ” పది పేపర్ ” లీకేజీ నిందితుల అరెస్ట్..

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదవ తరగతి పేపర్ లీకేజీ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో పేపర్ లీకేజీ కి కారణమైన వ్యక్తుల ను అరెస్టు చేశామని, ఎవరి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరుగుతుందని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించి నిందితుల వివరాలను ప్రకటన రూపంలో వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గత 21వ తేదీన పదవ తరగతి మొదటి (తెలుగు) పరీక్ష 09.30 గంటల నుండి 12.30 గంటల వరకు నిర్వహించబడింది. ఈ పరీక్ష మొదలైన అరగంట తర్వాత వాట్స్ అప్ లో తెలుగు ప్రశ్నాపత్రము చక్కర్లు కొడుతున్న విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి చేరింది. ఆ వెంటనే డీఈఓ ఎంఈఓ కు ఫోన్ చేసి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు.

కాగా ఎంఈఓ నకిరేకల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రూమ్ నంబర్ 8 వద్ద ఉదయం 9.50 గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిటికీ వద్ధకు వచ్చి పరీక్ష రాస్తున్న అమ్మాయి వద్ధ ఆమె ప్రశ్నా పత్రము సెల్ ఫోనులో ఫోటో తీసుకుని వెళ్ళినాడని నిర్ధారించుకొని ఎంఈఓ తన పై అధికారులతో పాటు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంఈఓ ఫిర్యాదు మేరకు సిఆర్ నెంబర్ 77/2025 యూ / ఎస్ 318(2), 318(3), 353(2), 223 బి ఎన్ ఎస్ అండ్ సెక్షన్ 8 ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997 ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించా రు. ఇందులో నేరస్తులు ఏ 1 నుండి ఏ 4 వరకు, ఏ 6 నుండి ఏ 11 మరియు సిసిఎల్ 1 అందరూ స్నేహితులు.

పదవ తరగతిపరీక్షలకు హాజరయ్యే వారి బంధువులకు అక్రమ మార్గాల ద్వారా ఎక్కువ మార్కులు రప్పించాలనే ఉద్దేశ్యంతో వారందరూ కలిసి పరీక్ష మొదలైన తర్వాత ఎక్కడైనా ప్రశ్నా పత్రము దొరుకుతుందేమోనని వెతికారు. ప్రశ్నాపత్రం దొరికిన వెంటనే జవాబులు వ్రాసి వారికి తెలిసిన వారికి ప్రశ్నలకు సమాధానాలు అంధించి ఎక్కువ మార్కులు పొందాలనే ఉద్దేశ్యంతో ఏ1, ఏ 3, సిసిఎల్ 1 లు ముగ్గురు కలిసి నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల వద్దకు ఉదయము 9.40 గంటలకు స్కూటీ మీద వచ్చారు. అక్కడ గేట్ వద్ధ అప్పటికే పోలీసు వారు వున్నందున లోపలికి వెళ్లడానికి వీలు కాక పోవడంతో వెంటనే వీరు ముగ్గురు స్కూల్ వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ11 కూడా వుండటంతో సిసిఎల్ 2 పాఠశాల వెనుక గోడ కిటికీ వైపు ఉన్న 1 వ అంత స్తులో రూము నెంబరు 8 లో పరీక్ష రాస్తుండగా అది గమనించిన ఏ11 అందులో పరిచయం ఉన్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నా పత్రాన్ని చూపించమని సిసీఎల్ 2 సైగ చేయగా ఆమె అందుకు ఒప్పుకోగా వెంటనే సిసిఎల్ 1, ఏ1 ఇద్దరు కలిసి ఏ11 సహాయంతో అక్కడ ఉన్న ప్రహరీ గోడ ఎక్కి సిసిఎల్ 2 వున్న కిటికీ వద్ధకు వెళ్ళగా ఆమె ప్రశ్నా పత్రాన్ని చూపించింది.

సి సిఎల్ 1 తన ఫోనులో తెలుగు ప్రశ్నా పత్రాన్ని ఫోటో తీసుకుని వెంటనే ఇద్దరు కిందికి దిగారు. ఆ ఫోటోలను సిసిఎల్ -1 నుండి మిగతా నేరస్తులకు ఒకరి నుండి ఒకరికి పంపుకోగా ఆ పేపర్ లో వున్న ప్రశ్నలకు ఏ4 ద్వారా సమాధానాలు తయారు చేసి వాటిని ఏ5 మూసి ఉన్న జీరాక్సు షాప్ లో జీరాక్సు తీసుకున్నారు. నే రస్తులు వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళగా అక్కడ వున్న పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్ళిపోయినారు.

ఎంఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించి గత 23 వ తేదీన నిందితులైన ఏ 1 నుండి ఏ 5, సిసిఎల్ 1 (బాల నేరస్థుడు ) లను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మిగిలిన నిందితులపై విచార ణ కొనసాగుతుంది. కాగా మొత్తం 13 మంది నిందితుల్లో ఆరుగురిని రిమాండ్ కు తరలించగా మరో ఆరుగురి పై విచారణ కొనసాగుతుంది. ఒకరు పరారీలో ఉన్నారు. మొత్తం 13 మందిలో ఇద్దరు బాల నేరస్తులు ఉన్నారని కేసు విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా కొన సాగుతుందని డీఎస్పీ తెలిపారు.

నేరస్తుల వివరాలు ఇలా ఉన్నాయి…

ఏ1 చిట్ల ఆకాష్ , ఏ2 చిట్ల శివ తండ్రి సైదులు, ఏ 3 బండి శ్రీను, ఏ 4 గుడుగుంట్ల శంకర్, ఏ 5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ 6 పోగుల శ్రీరాములు, ఏ 7 తలారి అఖిల్ కుమార్, ఏ 8 ముత్యాల వంశీ, ఏ 9 పలాస అనిల్ కుమార్, ఏ 10 పళ్ల మనోహర్ ప్రసాద్ , ఏ 11 రాహుల్ నకిరేకల్ పట్టణం ( పరారీలో ఉన్న వ్యక్తి ), సిసిఎల్ 1 బాల నేరస్థుడు ను జువెనైల్ బోర్డు ముందర హాజరు పర్చగా, సిసిఎల్ 2 ( బాల నేరస్థుడు ) ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button