
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, ఎన్టీఆర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ నగర్ లో చాపల లోడ్ తో వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్నటువంటి టాటా ఏస్, మూడు బైకులు మరియు చెట్టును వెంట వెంటనే ఢీకొట్టడగా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు చనిపోయినట్లుగా సమాచారం. లారీ వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. మరోవైపు ఈ లారీనే అతివేగంగా పరిసర ప్రాంతాల షాపుల పైకి కూడా దూసుకు వెళ్లినట్లుగా ప్రాథమిక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరికొద్ది సేపట్లో… ఈ ప్రమాదం పై మరిన్ని వివరాలు..
మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో.. పొందపరుస్తాం. అప్పటివరకు మా వెబ్సైట్ పై కూడా ఒక్క కన్నేసి ఉంచండి.
Read also : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నిరాశ పరుస్తున్న పోలింగ్ శాతం!
Read also : పహల్గాం దాడి తరువాత.. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్ర మోడీ హెచ్చరిక.. ఇక వారి గతి అంతే!





