
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా 9 మంది మరణించారు అని సమాచారం. ఈ తొక్కిసులాటకు గల కారణం కార్తీకమాసం ఏకాదశి కావడంతో వైష్ణవుని ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతోనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ తొక్కిసలాట లో భాగంగా తొమ్మిది మంది మరణించగా మరింత మంది గాయపడినట్లు తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానికులు వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమై అక్కడికి పైన మవుతున్నారు.
మరిన్ని వివరాలు మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో… త్వరలోనే…





