
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇవాళ విడుదల అవ్వాల్సినటువంటి అఖండ 2 సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. ఈ సినిమా ప్రీమియెర్స్ ను నిన్న రద్దు చేస్తున్నట్లుగా సాయంత్రం వార్తలు రాగా కొద్దిసేపటి తర్వాత వెంటనే సినిమా రిలీజ్ కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అసలు వాయిదా వేయడం ఏంటి అని బాలకృష్ణ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చాలా మంది అన్ని పనులు కూడా మానుకొని బాలకృష్ణ సినిమా చూడడానికి పెద్ద ఎత్తున టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి న్యూస్ రావడంతో ప్రతి ఒక్కరూ నిరాశ చెందుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా ఇలా రేపు విడుదల కావాల్సిన సినిమా వాయిదా వేయడం జరిగింది. విడుదలకు ముందే ఈ సినిమాకు ఇన్ని అడ్డంకులు రావడంతో మునుముందు ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also : IndiGo Crisis: వందల విమానాల రద్దు, అసలు ఇండిగో క్రైసిస్ వెనుక కారణమేంటి?
Read also : Air fares: ఇండిగో క్రైసిస్.. క్యాష్ చేసుకుంటున్న ఇతర విమాన సంస్థలు!





