వైరల్సినిమా

సంక్రాంతి బరిలో పెద్ద, చిన్న హీరోలు.. మరి విన్నర్ ఎవరో?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రతి సంక్రాంతికి దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా ఐదు పెద్ద,చిన్న హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలతో థియేటర్లన్నీ కూడా సందడి చేస్తూ ఉంటాయ్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎంతోమంది పట్టణాలలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆయా సొంత గ్రామాలకు లేదా బంధువుల గ్రామాలకు వెళ్లి మరి ఆనందంగా గడుపుతుంటారు. ఈ ఆనందంలో సినిమాలు కూడా ఒక భాగమే.

Read also : విజయ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న రింకూ సింగ్?

అయితే ఈసారి పెద్ద, చిన్న హీరోలందరూ కూడా పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్(రాజా సాబ్), మెగాస్టార్ చిరంజీవి (మన శంకర్ వరప్రసాద్ గారు), ఇక మాస్ మహారాజా రవితేజ (భర్త మహాశయులకు విజ్ఞప్తి), ఇక చిన్న హీరో నవీన్ పోలిశెట్టి (అనగనగా ఒక రాజు), ఫ్యామిలీ హీరో శర్వానంద్ (నారీ నారీ నడుమ మురారి) అనే సినిమాలతో రానున్నారు. మరి ఈ సినిమాలకు సంబంధించి టీజర్స్ అలాగే ట్రైలర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా మా హీరో సినిమానే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా ఓటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మరి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ సినిమా ఏదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read also : చార్జీలు పెంచితే సహించేదే లేదు.. ఏపీ రవాణా శాఖ కీలక హెచ్చరికలు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button