
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గత నెల 22వ తేదీన మొదలైన దసరా ఉత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిసాయి. దసరా ఉత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారి మాలను చాలామంది ధరించారు. నేడు మాల ధరించిన భవానీలు అందరూ కూడా విజయవాడలోని ఇంద్రకీలాద్రి వైపు అడుగులు వేస్తున్నారు. మాల విరమణ కోసం నిన్నటి నుంచి కొన్నివేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలు భవాని భక్తులతో విపరీతమైన రద్దీ ప్రాంతం గా మారిపోయింది. నేటి నుంచి మరో రెండు మూడు రోజులు పాటు భక్తుల రద్దీ తగ్గే అవకాశం కనిపించడం లేదు. మొన్నటివరకు అమ్మవారి నవరాత్రులు ఉత్సవాలు జరగగా.. ఏకంగా 15 లక్షల మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపి కోరికలు కోరుకున్నారు. అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ముగియగానే మాల ధరించిన భవానీలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వైపు అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు రంగురంగుల కాంతులతో కలకలలాడిన విజయవాడ ఇంద్రకీలాద్రి… మరో రెండు రోజుల్లో మామూలు పరిస్థితికి రానుంది.
Read also : పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్న మన తెలుగు ఆల్రౌండర్!
Read also : ఆహా రూమర్స్… చివరికి ఎంగేజ్మెంట్ తో ఒకటైన రష్మిక, విజయ్ దేవరకొండ!