లక్ష్మీదేవిగూడెం ప్రజలకు కృతజ్ఞతలు
సర్పంచ్ ఎలికెట్టి భరత్
క్రైమ్ మిర్రర్,వేములపల్లి ప్రతినిది: నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము, లక్ష్మీదేవిగూడెం గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తూ, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అని నూతన సర్పంచ్ ఎలికెట్టి భరత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తనపై విశ్వాసం ఉంచి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న లక్ష్మీదేవిగూడెం గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ ఎలికట్టి భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ….. నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ల సహకారంతో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు. నేను గ్రామపంచాయతీలో ప్రజలందరిని పార్టీ బేధం లేకుండా తన దగ్గరికి వచ్చిన ఏ సమస్య అయినా పార్టీలకతీతంగా పనిచేస్తానని తెలియజేశారు.
తనకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అంతేగాక లక్ష్మీదేవిగూడెం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా పాటుపడి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని తెలిపారు.





