
TollyWood : బెట్టింగ్ యాప్స్ ఎంతో మందిని బలితీసుకున్నాయి. ఆశపెట్టి… అమయాకుల ఖాతాలు ఖాళీ చేసి.. రోడ్డుపై నిలబెట్టేశాయి. అన్ని పోగొట్టుకున్నాక ప్రాణమెందుకని… వారంతట వారే ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. మరోవైపు.. బాధ్యతగా ఉండాల్సిన ప్రముఖులు, ప్రజల్లో చైతన్యం నింపాల్సిన సినీ నటులు.. సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. వంద రూపాయలు పెడితే.. కోట్లు వస్తాయని నమ్మించే యాడ్స్ చేశారు. వారి సంపాదన వారు చూసుకున్నారే కానీ… తాము చెప్పేది నమ్మిన అమాయక ప్రజల సంగతేంటని ఆలోచించలేదు. అందుకే… పోలీసులు ప్రమోటర్ల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల జాడ్యాన్ని… రాష్ట్రం నుంచి పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన సెలబ్రిటీల లిస్ట్ తీశారు పోలీసులు. అందులో ప్రముఖుల పేర్లు ఉండటంతో… ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారే. అంతేకాదు.. అందరికీ నీతులు చెప్పే సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా పాత్రదారుడే. వీరే కాదు.. హీరోయిన్లు, ప్రముఖ తెలుగు యాంకర్లు, యూట్యూబర్లు… ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే నోటీసులు పంపారు పోలీసులు. నోటీసులు అందుకున్న వారు ఒక్కొక్కరుగా విచారణకు హాజరువుతున్నారు.
Read More : అసెంబ్లీ వేదికగా మందకృష్ణ మాదిగను ప్రశంసలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్!..
రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ కారణంగా సర్వం పోగొట్టుకుని.. అప్పుల బాధలు భరించలేక సుమారు వెయ్యి మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌తో జరుగుతున్న దారుణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వమే చెప్పాక… పోలీసులు ఊరుకుంటారా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే.. బుల్లితెర నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారణ జరిపారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టు విచారణలో ఆమె ఒప్పుకున్నారు. టేస్టీ తేజాకు కూడా నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
Read More : టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?
అయితే.. ప్రముఖ నటులు దగ్గుబాటి రానా, విజయదేవరకొండ, ప్రకాష్‌రాజ్.. హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత, నటి మంచు లక్ష్మీ, అనన్యా నాగళ్ల, యాంకర్లు శ్యామల, శ్రీముఖి పేర్లు ఈ ప్రమోటర్ల జాబితాలో ఉన్నాయి. దీంతో.. టాలీవుడ్ వణుకుతోంది. మరోవైపు.. పేర్లు బయటకు వచ్చిన ప్రముఖ నటులు ఎవరికి వారు వివరణ ఇచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై దగ్గుబాటి రానా టీమ్ వివరణ ఇచ్చింది. రానా.. స్కిల్ బేస్డ్ యాప్స్‌కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారని… అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమని, లీగల్ అనుమతులు చెక్ చేసిన తర్వాతే.. రానా ప్రచారం చేశారని ఆయన టీమ్ స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండ టీమ్ కూడా ఇదే సమాధానం ఇచ్చింది. నటుడు ప్రకాష్‌రాజ్ కూడా తన వర్షన్ చెప్పుకొచ్చారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసింది వాస్తమే అన్నారాయన. కానీ, అలా చేయడం తప్పని తెలిసిన తర్వాత మానేశానని చెప్పారు. తాను ప్రచారం చేసిన యాడ్స్ ప్రచారం చేయొద్దని కూడా కంపెనీ వాళ్లకు చెప్పేశానన్నారు. కానీ… తాను ప్రచారం చేసిన కంపెనీకి నిర్వాహకులు మారిన తర్వాత.. తనకు తెలియకుండా యాడ్ ప్లే చేశారని చెప్తున్నారు ప్రకాష్‌రాజ్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో… పేర్లు బయటకు వచ్చిన ప్రముఖుల్లోనూ ఆందోళన మొదలైంది.
ఇవి కూడా చదవండి …
-
జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!
-
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..
-
కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.
-
టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం
-
2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?