
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- జాగృతి పార్టీ చీఫ్ కవిత నేడు తన తండ్రి KCR ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా “జాగృతి జనం బాట” అనే కార్యక్రమాన్ని కెసిఆర్ ఫోటో లేకుండానే ముందుకు వెళ్లాలని కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. నేను ఆయన కడుపున పుట్టడం నా జన్మ జన్మల అదృష్టం. కానీ అంత మాత్రం మా నాన్న ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దారులు వేరవుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ పేరు చెప్పుకోవడం నైతికంగానూ అలాగే ఆలోచించి చూసిన కూడా ఇది కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే ఆలోచన నాది కాదు అని… నేను వేరే మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నాను అంటూ కవితా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అప్పట్లో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటోలు లేకుండానే జయశంకర్ ఫోటోనే పెట్టామంటూ చెప్పుకోచ్చారు. దీంతో కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని చర్చలు మొదలయ్యాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ కూతురిగానే మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు అలాంటిది అతని ఫోటోనే లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు?.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కవిత కొత్త పార్టీతో బీఆర్ఎస్ కి లాభం చేరుతుందో?.. లేదా?.. అనేది కూడా ఆసక్తిగా మారింది. కవిత జాగృతి పార్టీ వల్ల రాష్ట్రంలోని కొన్ని పార్టీల మధ్య ఓట్లు చీలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read also : చిన్నపిల్లల భద్రత కోసం.. ‘Instagram’ సరికొత్త రూల్స్
Read also : బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్!