క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్
గౌతమ్ గంభీర్ కు తాజాగా బీసీసీఐ షాకిచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 2023 ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నటువంటి కోల్కత్తా నైట్ రైడర్స్ కప్పు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మరుక్షణం వెంటనే టీమిండియాకు గంభీర్ ను హెడ్ కోచ్ గా నిలబెట్టింది. ఇక గంభీర్ కోచ్గా మారిన అనంతరం ఒక టి20 లు తప్ప మిగతా రెండు ఫార్మాట్లు కూడా టీమిండియా సరిగా ఆడక పోవడం కారణంగా గౌతమ్ గంభీర్ ను కోచ్ స్థానం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ముందడుగు వేసిన ప్రభాస్!… డ్రగ్స్ పట్ల అభిమానులకు సందేశం?
తాజాగా గౌతమ్ గంభీర్ణు తొలగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లుగా PTI తెలిపింది. ఇప్పటికే టీం ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్లు ఓడిపోయి ఒకటి టైగా ముగించింది. దీంతో ఆఖరి టెస్ట్ లో కూడా ఓడిపోతే మాత్రం బిసిసిఐ గౌతమ్ గంభీర్ తొలగించే ఆలోచనలో ఉన్నారట. అయితే టీమిండియా కోచ్గా తమ మొదటి ప్రాధాన్యత వివిఎస్ లక్ష్మణ్ దక్కుతుందని చెప్పుకొచ్చారు. కానీ వీవీఎస్ లక్ష్మణ్ అంగీకరించకపోవడంతో గౌతమ్ గంభీర్ కు ఇచ్చామని తెలిపారు.
భారతదేశ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన మోడీ..!
కాగా గౌతమ్ గంభీర్ రూల్స్ అధిక్రమిస్తున్నారని గౌతమ్ గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ పై బీసిసిఐ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందింది. అయితే గౌతమ్ గంభీర్ కోచ్గా ప్రారంభించినప్పుడు నుండి టీమిండియా టి20 లు దూకుడుగా ఆడడం ప్రారంభించింది. అయితే అదే తీరుగా టెస్టులలో కూడా ప్రారంభం అవడంతో టెస్టులలో ఓటమి దిశగా అడుగులు వేసింది. దీంతో త్వరలోనే గౌతమ్ గంభీర్ కోచ్ నుండి తొక్కుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి.