
క్రైమర్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారత్ ఘోరపరాజయాన్ని పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో కూడా మన భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో ఇండియాకు కోచ్ గా ఉన్నటువంటి గంభీర్ పై ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ ను కోచ్ నుంచి తొలగించాలి అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న వేళ బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. గంభీర్ పై ఇప్పటిలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోము అని స్పష్టం చేశారు. తాజాగా గంభీర్ ఒక మీడియా ముందు మాట్లాడుతూ తన భవిష్యత్తుపై బీసీసీఐ దే తుది నిర్ణయం అని తెలిపారు. అయితే కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై తాజాగా బీసీసీఐ లోని ఒక అధికారి ఇప్పట్లో తన గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అని వెల్లడించినట్లు ఎన్డిటీవీ పేర్కొంది. ప్రస్తుతం ప్లేయర్ల ప్రతిభను బట్టి జట్టులో మార్పులు చోటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దీంతో కేవలం ప్లేయర్లు మారొచ్చేమో కానీ కోచ్ గంభీర్ మాత్రం మారే అవకాశాలు కనిపించట్లేదు. ఈ బీసీసీఐ అధికారి మాట్లాడిన మాటలను చూస్తుంటే కోచ్ మార్పు ఉండదు అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
Read also : నేడే మహిళల మెగా వేలం.. అదృష్టం ఎవరిని వరించేనో?
Read also : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఏపీ లో దంచికొట్టనున్న భారీ వర్షాలు!





