తెలంగాణ

త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌.. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. చర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉంది. రాష్ట్ర ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమన్నారు. చర్లపల్లి టెర్మినల్‌తో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని మోదీ వివరించారు.. వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని..రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని.. నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Read Also : తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన

మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యమని.. రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోందన్నారు. వందే భారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టామని.. త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం అవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేశారు. చర్లపల్లి స్టేషన్ తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా త్వరలో మొదలుపెట్టాలని కోరారు. మచిలీపట్నం పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడంతో పాటు తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. అంతే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే సహాయమంత్రి సోమన్న, బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి : 

  1. మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!
  2. భారత్‌లో తొలి HMPV కేసు..?.. 8 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!!
  3. ప్రారంభమైన హైడ్రా గ్రీవెన్స్.. స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ రంగానాథ్
  4. హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
  5. వెల్‌కమ్‌ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Back to top button