
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ సంఘాల నేతల మధ్య జరిగిన ఫోటో వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ సంఘాల నేతలు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రెస్ మీట్ సందర్భంగా ఫోటోలో ఎవరి స్థానంలో ఎవరు నిలబడాలి, మీడియా షాట్‌లో ఎవరు ముందుండాలి అనే అంశంపై నేతల మధ్య మాటల తగవు మొదలైంది. తరువాత క్రమంగా వాగ్వాదం తీవ్రంగా మారి, ఒకరిపై ఒకరు పిడిగుద్దుల దాడి చేసుకున్నారు.
Read also : రైల్లో మహిళపై దారుణం.. కత్తితో బెదిరించి అత్యాచారం.!
సన్నివేశం ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న ఇతర బీజేపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా మధ్యవర్తిత్వం చేసి, శాంతించమని హెచ్చరించారు. అయితే ఆర్. కృష్ణయ్య అనుచరులు వెనక్కి తగ్గకపోవడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. తరువాత పార్టీ నేతల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్టీ వర్గాల ప్రకారం, ఈ ఘటనపై అంతర్గత నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read also : హైడ్రాతో హైదరాబాద్‌ను హడలెత్తించిన కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలి : MLC నవీన్